ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా సమయంలో తప్పుడు ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ తప్పుడు ప్రచారం విషయంలో ఏపీ సర్కార్ బాగా ఇబ్బంది పడుతుంది. ఆక్సీజన్ కి సంబంధించి మందులకు సంబంధించి బెడ్ లు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. రోజు రోజుకి కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది.
ఇక ఇప్పుడు సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది ఏపీ సర్కార్. ఎవరు అయినా సరే తప్పుడు ప్రచారం చేస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చింది. విపత్తు సమయంలో తప్పుడు ప్రచారం చేసే వారిపై దృష్టి పెట్టింది. ప్రజలను భయపెట్టే వారిని వదిలేదని సర్కార్ ఘాటుగా చెప్పింది.