కడప: కట్టుకున్న భర్తే .. భార్యను కడతేర్చాడు. పెళ్లి చేసుకుని కనీసం ఏడాది కూడా పూర్తి కాలేదు అప్పుడే భార్యను చంపేశారు. జీవితాంతం భార్యతో ఉండాలని భర్త అత్యంత కిరాతంగా ఆమెతో వ్యవహరించారు. దారుణంగా చంపడమే కాదు భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని బద్వేల్ సుందరయ్య కాలనీలో జరిగింది. భార్యను భర్త కత్తితో పొడిచి చంపారు. ఏడు నెలల క్రితం వీరిద్దరి పెళ్లి జరిగింది. భార్యను అనుమానంతోనే భర్త చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు అప్పగించాలని అంటున్నారు.