PM Modi: ఎలక్ట్రిక్ కారు ఈ-విటారాను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ టారిఫ్ లకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ లోని హన్సల్ పూర్ లో తయారైన మారుతి సుజుకీ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని ”ఈ-విటారా” వాహనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ లాంచ్ చేశారు.

ఈ వాహనాలు జపాన్, యూరప్ తో సహా 100 దేశాలకు ఎగుమతి అవుతాయని మోదీ ప్రకటించారు. ఇది దేశ బ్యాటరీ ఎకో సిస్టమ్ బిగ్ బూస్ట్ అని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వాహనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.