మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యశోద (36) అనే మహిళ రేబీస్ వ్యాధి సోకిందని తన మూడేళ్ల కూతురును చంపి అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి యశోద భర్త షాకింగ్ విషయాలను వెల్లడించారు. కుక్కలు ఎంగిలి చేసిన పల్లీలు తినడం వల్ల పాపకు రేబీస్ వ్యాధి సోకిందని యశోద అనుమానించినట్టుగా యశోద భర్త అన్నారు.

టీకాలు వేయించిన కూడా అనుమానం పోలేదని, మతిస్థిమితం కోల్పోయిందని చెప్పారు. దీంతో యశోద తన కూతురిని చంపి అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకుంది. యశోద భర్త, వారి కుటుంబ సభ్యులు మరణ వార్త తెలిసి కన్నీటి పర్యాంతం అవుతున్నారు. చిన్న పిల్ల అని కూడా ఆలోచించకుండా ఇలా పాపను చంపి తాను సూసైడ్ చేసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.