TDP MLA Kuna Ravikumar: ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యయత్నం చేసుకున్న సంఘటన పై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పందించారు. KGVB ప్రిన్సిపాల్ సౌమ్య నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని, ఆరోపణలు చేసినట్లు కాదు ఆధారాలు చూయించాలన్నారు. ఇప్పటివరకు నేను సౌమ్యని నేరుగా ఒక్కసారి కూడా కలవలేదు… రాత్రి 7 తర్వాత మహిళా అధికారులను నా కార్యాలయానికి రమ్మననని అని పేర్కొన్నాడు.

ప్రజలు, విద్యార్థులు ఫిర్యాదుల ఆధారంగా సౌమ్యపై చర్యలు తీసుకున్నామన్నారు. మహిళ అయినంత మాత్రాన ఏ ఆరోపణలు పడితే ఆ ఆరోపణలు చేస్తానంటే కుదరదని ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ప్రిన్సిపాల్ పై పరువునష్టం దావా వేస్తాను… మహిళలకే కాదు పురుషులకు కూడా క్యారెక్టర్ అనేది ఉంటుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.