డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు చేస్తుమంటూ అధికారులు మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయింది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని పైలెట్ గ్రామం అయిన జాన్‌పహాడ్‌లో పంచాయతీ కార్యదర్శి వసూళ్లు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఒక లబ్ధిదారుడిని 2% కమిషన్ ఇవ్వాలని, లేకపోతే బిల్లు మంజూరు అవ్వదని పంచాయతీ కార్యదర్శి బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ కమిషన్ లో ఏఈ, డీఈలకు కూడా వాటా ఉంటుందని పేర్కొన్న కాల్ రికార్డింగ్‌ను బయట పెట్టాడు ఓ లబ్ధిదారుడు. మండలంలో అనేక మంది వద్ద డబ్బులు వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారులు.
డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు.. ఆడియో కాల్ లీక్
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని పైలెట్ గ్రామం అయిన జాన్‌పహాడ్‌లో పంచాయతీ కార్యదర్శి వసూళ్లు
ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఒక లబ్ధిదారుడిని 2% కమిషన్ ఇవ్వాలని, లేకపోతే బిల్లు మంజూరు అవ్వదని పంచాయతీ కార్యదర్శి… pic.twitter.com/bhuxhT9P7D
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2025