బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. శనివారం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ప్రెస్‌మీట్ చూశాక కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని అర్థమైంది అన్నారు.
హైడ్రోజన్ బాంబు వేస్తాడు అనుకుంటే చిన్న పిల్లలు ఆడుకునే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయలేదు అని విమర్శలు చేశారు. ఆ ప్రెస్ మీట్‌కే ఇంత పబ్లిసిటీ చేశారు అని ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా, హెచ్ సీయూ భూముల్లోని 400 ఎకరాల్లో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని.. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఓ బీజేపీ ఎంపీ హస్తం ఉందని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే.