పాపం తెలంగాణా టీచర్లు… ఇప్పటి వరకు ఎంతమందికి సాయం…? ఇదిగో లెక్క…!

-

ప్రైవేటు స్కూల్ టీచర్లకు, సిబ్బందికి సాయం అందలేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా కారణంగా నష్టపోతున్న టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తామని చెప్పింది. రెండు వేల రూపాయలు, 25 కిలోల బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు కూడా అవి చాలా మందికి అందలేదు. డీఈఓ కార్యాలయాల చుట్టూ ప్రైవేట్ టీచర్ లు తిరుగుతూనే ఉన్నారు.

1.45 లక్షల మందికి సహాయం అందిస్తామని సర్కార్ చెప్పింది. తెలంగాణలో మొత్తం ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లు, సిబ్బంది సుమారు మూడు లక్షలు మంది ఉన్నారు. 1.24 లక్షల మందిని విద్యాశాఖ గుర్తించింది. ఇప్పటివరకు 99 వేల మందికి సాయం అందింది. ఇంకా 60 శాతం మందికి సాయం అందలేదు అని లెక్కలు చెప్తున్నాయి. ఒక పక్కన జీతం రాక ప్రభుత్వ సాయం అందక ఉపాధ్యాలు ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version