ఎన్నికలు నిర్వహించే విషయంగా ఏపీ ప్రభుత్వం vs నిమ్మగడ్డ మధ్య జరిగిన గొడవ ఎవరూ మర్చిపోయి ఉండరు. ఒక రేంజ్ లో వీరి గొడవ జరిగింది. ఏకంగా సుప్రీం ఆదేశిస్తే కానీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దం కాలేదు. అయితే ఎన్నికలు నిర్వహిస్తున్నా సరే రోజుకొకరు చొప్పున మంత్రులు నిమ్మగడ్డను టార్గెట్ చేసి విమర్శలు చేసే వారు. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి మీద నిమ్మగడ్డ సంచనల ఆదేశాలు జారీ చేశారు.
ఆ ఆదేశాలకు సంబంధించి ఆయన నిమ్మగడ్డ మీద చర్యలు తీసుకోమని శాసన సభ ప్రవిలేజ్ కమిటీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఇప్పుడు ఆ అంశం మీద సాయంత్రం ఆరు గంటలకు శాసన సభ ప్రవిలేజ్ కమిటీ సమావేశం కానున్నట్టు చెబుతున్నారు. వర్చువల్ విధానంలో సమావేశం కానున్న ప్రవిలేజ్ కమిటీ భేటీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసులు పై కాకాణి గోవర్ధన్ నేతృత్వంలోని కమిటీ దృష్టి సారించనున్నట్టు చెబుతున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వివరణ అడిగే దిశగా కమిటీ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అలానే ఎస్ఈసీ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.