టీడీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ షాక్

-

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అధికార పార్టీపై పోరాటం చేసే విషయంలో దూకుడుగా ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండి అధికార పార్టీ మీద ఘాటుగా విమర్శలు చేయాలి అంటే నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇక శాసన సభా సమావేశాల్లో వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారికి తాజాగా షాక్ తగిలింది.

సభను తప్పుదోవ పట్టిస్తున్నారనే కారణంతో సిఎం జగన్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో ప్రివిలేజ్ కమిటీ భేటీ అయింది. అచ్చెన్న, నిమ్మలకు నోటీసులు జారీ చేయాలని ప్రివిలేజ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు ప్రివిలేజ్ కమిటీ భేటీ ఇవ్వనుంది. జనవరి పదో తేదీలోగా సమాధానం ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

జనవరి 18 లేదా 19వ తేదీల్లో తిరుపతిలో ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ కానుంది. తామిచ్చిన ప్రివిలేజ్ నోటీసుల విషయమేంటంటూ కమిటీ భేటీలో టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ ప్రస్తావించారు. అచ్చెన్నపై స్పీకరే స్వయంగా రిఫర్ చేశారని ఛైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రామానాయుడుపై ప్రివిలేజ్ నోటీసు విషయంలో సభలో తీర్మానం చేశామని కాకాని వ్యాఖ్యానించారు. తామిచ్చిన నోటీసులను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ మరోసారి అసెంబ్లీ సెక్రటరీని టీడీపీ సభ్యుడు అనగాని కోరారు. సభలో సభ్యులందరి హక్కులను కాపాడే విధంగా ప్రివిలేజ్ కమిటీ వ్యవహరించాలని అనగాని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version