వైఎస్ షర్మిలకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు

-

తన కొత్త పార్టీకి రాజకీయ వ్యూహకర్త నియమించారు వైఎస్ షర్మిల. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియా షర్మిల పార్టీకి నియామకం అయ్యారు. అంతేకాదు.. తమిళనాడు డిఎంకె ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ఈ ప్రియ. ప్రశాంత్ కిశోర్ వద్ద శిష్యురాలుగా పనిచేసింది ప్రియా. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ షర్మిల కొత్త పార్టీకి వ్యూహకర్తగా ప్రియా నియామకం అయ్యారు. అయితే… వైఎస్‌ షర్మిల ఎలా ప్రసంగించాలి, ఏ అంశాలు లేవనెత్తాలనే దానిపై ఎప్పటికప్పుడు సూచనలు చేయనుంది ప్రియా.

 

 

ఇక వచ్చే నెల జూలైలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా షర్మిల పార్టీ ప్రకటన చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ ఉదయం ఇడుపుల పాయలో 8.30 గంటలకు ప్రార్థనలు చేయనున్నారు షర్మిల. అనంతరం… కడప నుంచి ప్రత్యేక చాపర్ లో 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు. 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల… 4 గంటలకు JRC కన్వెన్షన్ కు చేరుకోనున్నారు. అనంతరం 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version