రుణమాఫీ కాలేదని మనోవేదనతో ఓ అన్నదాత గుండెపోటుకు గురై మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండాపురంలో ఈ ఘటన శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. రైతు పుట్ట వెంకటేశ్వర్లు(46)కు రూ.60 వేలు పంట రుణం ఉంది. ఇటీవల ప్రభుత్వం చేసిన రుణమాఫీలో వెంకటేశ్వర్ల రుణం మాఫీ కాలేదు.
తనకున్న ఎకరం 28 గుంటల భూమిలో మిర్చి, వరి సాగు చేసిన వెంకటేశ్వర్లకు కాలం కూడా కలిసి రాలేదు. దిగుబడి సరిగా రాక అప్పుల పాలయ్యాడు.దీంతో అప్పులు తీర్చలేక రుణమాఫీ కాలేదని తీవ్ర మనోవేదనకు గురైన పుట్ట వెంకటేశ్వర్లకు గుండెపోటు వచ్చింది.కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్దారించారు.దీంతో అన్నదాత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.