మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది : ప్రియాంక గాంధీ

-

కాంగ్రెస్‌ పార్టీ సరూర్‌నగర్‌లో నిర్వహించిన యువ సంఘర్షన సభకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేశారని, మా కుటుంబం కూడా ఎన్నోత్యాగాలు చేసిందన్నారు. ఆ బాధ ఏంటో మాకు తెలుసునని, తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసిందికాదన్నారు. తెలంగాణ ఏర్పడితే అందరూ మంచి జరుగుతుందని అనుకున్నారని..కానీ కేసీఆర్ ఇక్కడ నియంత పాలన చేస్తున్నారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఎవరికైనా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు.

రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి..మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే పరిమితం అయ్యాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డెవలప్ మెంట్ లేదు..వివిధ వర్గాల ప్రజలకు సాయం లేదు..ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 మంది నిరుద్యోగులు ఉన్నారని వారంతా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను తగ్గించారని… విద్యా బడ్జెట్ ను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతీ వ్యక్తిపై వేల రూపాయల అప్పుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version