కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు.. తెలంగాణలోని నిరుద్యోగులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో యువ సంఘర్షణ సభను ఏర్పాటు చేసింది. సరూర్ నగర్ లో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, అనేకమంది బలిదానాలు ఇచ్చారన్నారు. తెలంగాణ ఆకాంక్షల మేరకే ఆనాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, తెలంగాణ వచ్చి 9 ఏళ్లు అయినా ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇక్కడి ప్రజలకు కాకుండా.. కేసీఆర్ కుటుంబం, స్నేహితులకు మాత్రమే అందాయని ఆమె వ్యాఖ్యానించారు. ఈరాష్ట్రం మా జాగీర్ అనుకుంటోంది ప్రభుత్వం..
ఇంటింటికీ ఒక ఉద్యోగం అని కేసీఆర్ అన్నారు.. మరి, వచ్చిందా? నిరుద్యోగ భృతి 3వేలు ఇస్తానన్నారు.. ఇచ్చారా? TSPSC పేపర్ లీక్ పై ఎవరిపైనైనా చర్యలు తీసుకున్నారా? ఒక్క యూనివర్సిటీ కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదు.. స్కూల్స్ సంఖ్య తగ్గిస్తున్నారు.. విద్యా బడ్జెట్ తగ్గిస్తున్నారు.. రెండున్నర లక్షల మంది రైతులపై లక్ష అప్పు ఉంది.. ఇప్పటి వరకు 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. మీ డబ్బు, సంపద ఎక్కడికి పోయింది..?’ అని ఆమె ప్రశ్నించారు.