ప్రియాంక జవాల్కర్ గూగుల్ హిస్టరీ ని అడిగిన నేటిజెన్…సూపర్ రిప్లై ఇచ్చిన ప్రియాంక..!

-

అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీ వాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రియాంక జవాల్కర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ ఎస్ ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకున్నాయి. ఇలా సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది.

అయితే ఈ క్రమంలో ప్రియాంక జవాల్కర్ ను తన గూగుల్ హిస్టరీ చూపించమని ఎవరో అడిగారట. ఈ విషయంపై ప్రియాంక జవాల్కర్ స్పందిస్తూ… రాత్రి తను సెర్చ్ చేసిన వాటిని ఏకంగా స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో ప్రియాంక జవాల్కర్ నాసా, మల్టీవర్స్, టైం ట్రావెల్, పారలల్, యూనివర్స్ వర్సెస్ మల్టీవర్స్, జీమెయిల్, అనురాగ్ కశ్యప్ ఇలా రకరకాలుగా సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version