రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసును పోలీసులు రెండో రోజునే ఎట్టకేలకు చేధించారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం.. చివరకు కేంద్ర హోం మంత్రి సైతం దీనిపై స్పందించడంతో ప్రభుత్వం పోలీసులకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది.
పోలీసులు 15 బృందాలుగా ఏర్పడి గాలించడంతో పాటు టోల్ ప్లాజాతో పాటు నిందితులు ఏ బంక్‌లో అయితే పెట్రోల్ కొన్నారో అక్కడ విచారించడం.. బైక్ పంచ్చర్ల షాపు వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ తీసుకోవడం… దానిని క్షుణ్ణంగా పరిశీలించడం… సెల్ సిగ్నల్ ఎక్కడ క్లాష్ అయ్యాయో చూడడంతో నిందితులు సులువుగానే పట్టుబడ్డారు.
టాప్ లెఫ్ట్ : మహ్మద్ పాషా (ప్రధాన నిందితుడు)
టాప్ రైట్ : చింతకుంట చెన్నకేశవులు
బాటమ్ లెఫ్ట్ : జొల్లు నవీన్
బాటమ్ రైట్ : జొల్లు శివ
ఈ నలుగురు నిందితులు అంతా టీనేజ్ వయస్సులోనే ఉన్న వారు కావడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ నలుగురిలో ఇద్దరు లారీ డ్రైవర్లు ఉండగా… మరో ఇద్దరు క్లీనర్లు ఉన్నారు. ప్రియాంకను లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కలిసి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఇక ఈ నలుగురు ముందుగా టోల్ ప్లాజా వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ప్రియాంకను బలవంతంగా తీసుకువెళ్లి అక్కడే అత్యాచారం చేసి.. గొంతు నులిమి చంపేశారు.
హతురాలి బైక్ పంక్చర్ పడడంతో అందుకు సాయం చేస్తున్నట్టు ఆమెను నమ్మించి మరీ హత్యాచారం చేశారు. ఇక ఈ నలుగురు నిందితుల విషయానికి వస్తే వీరు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వారిలో మహ్మద్ పాషా అనే వ్యక్తి నారాయణ పేట్ మండలం మహబూబ్‌నగర్ వాసి ఒకడు కాగా.. అతడిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం.
మిగిలిన ముగ్గురు నిందితుల్లో జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులుగా గుర్తించారు. వీరు అత్యాచారం చేశాక.. ఆ తర్వాత ప్రియాంకరెడ్డిని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. కిరోసిన్ పోసి ప్రియాంకను దహనం చేశారని.. 70 శాతం ప్రియాంక మృతదేహం కాలిపోయింది.