హత్య కు ముందు సోదరి తో ప్రియాంకారెడ్డి ఫోన్ సంభాషణ.. ఆడియో

-

షాద్‌నగర్‌ సజీవ దహనం కేసులో కీలక సమాచారం దొరికింది. ప్రియాంక ఆరోజు రాత్రి ఉన్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఆమె తన సోదరితో మాట్లాడిన మాటల్లో అర్థమవుతుంది. డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్యకు ముందు చివరిసారిగా తన సోదరితో మాట్లాడిన ఫోన్‌ కాల్‌ రికార్డు వెలుగు చూసింది. తన స్కూటీ పంక్చర్‌ అయ్యిందని, అక్కడ ఉన్న ఓ అబ్బాయి పంక్చర్‌ చేయిస్తానంటూ తీసుకెళ్ళాడని ప్రియాంక తన సోదరితో చెప్పింది.

బైక్ వ‌చ్చే వ‌ర‌కు త‌న‌తో మాట్లాడు అంటూ ప్రియాంకా తన సోద‌రితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్న‌ది. కొద్ది సేపటికి వచ్చిన క్లీనర్‌ పంక్చర్‌ షాపు లేదన్నాడని తెలిపింది. తాను స్కూటీ తీసుకెళ్తానంటే అడ్డుపడుతున్నాడని.. సోద‌రితో ఫోన్లో మాట్లాడిన త‌ర్వాత ప్రియాంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.

ఔటర్ రింగ్ రోడ్డుపై లారీలను పార్కింగ్ చేసిన డ్రైవర్లు ఎవరైనా ప్రియాంక రెడ్డిపై అత్యాచారానికి పాల్పడి ఉంటారా లేదా తెలిసిన వారే ఎవరైనా ప్రియాంకను హత్య చేసి ఉంటారా?? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version