బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడక్షన్ బాయ్.. వీడియో వైరల్..!

-

బిగ్ బాస్ ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న రియాల్టీ షో.. మొట్టమొదటిసారి ఇండియాలో హిందీలో ప్రసారమైన ఈ షో 15కుపైగా సీజన్లను పూర్తి చేసుకుంది. తెలుగులో కూడా ఇప్పుడు ఆరవ సీజన్ ఈ వారం ముగియబోతున్న విషయం తెలిసిందే. వచ్చే యేడాది కొత్త సీజన్ కూడా మొదలు పెట్టడానికి ఇప్పటినుంచే నిర్వాహకులు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే 24 గంటల లైవ్ స్ట్రీమింగ్ చేయటం , సరైన కంటెస్టెంట్లు లేకపోవడం వల్లే షో కి ఆదరణ పెరగలేదని చెప్పాలి.

అయితే బిగ్ బాస్ హౌస్లో లోపల ఏం జరుగుతోంది.. బయట ఏం చూపిస్తున్నారు అనేది ఎవరికి తెలియడం లేదు . తాజాగా బిగ్ బాస్ కు సంబంధించిన ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు బిగ్ బాస్ హౌస్ లో ప్రొడక్షన్ బాగా పనిచేస్తున్న ఒక వ్యక్తి. తాజాగా ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన తెలిపారు.. ప్రొడక్షన్ బాయ్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ షోలో ప్రతిదీ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. మీకు కనబడేది కేవలం ఒక మెయిన్ డోర్ మాత్రమే.. కానీ చుట్టూ దాదాపు 26 డోర్లు ఉంటాయి. మేము అన్ని అందిస్తూ ఉంటాము. ఎలిమినేట్ అయిన తర్వాత ఓ సీక్రెట్ రూమ్ లో ఉంచుతారు. బయట వాళ్ల ఓటింగ్ తో సంబంధం లేదు. ఈసారి అంతా ముందే డిసైడ్ అయిపోయింది.

ఈసారి అంతా రేవంత్ విన్నర్ అవ్వాలని ముందే డిసైడ్ అయ్యారు. ఆదిరెడ్డిని మొన్నే ఎలిమినేట్ చేయాలనుకున్నారు.. కానీ కామన్ మ్యాన్ ఇంతవరకు రావడం ఇదే మొదటిసారి కాబట్టి ఇంకొన్ని రోజులు ఉంచుదాం అనుకున్నారు. మేము మొత్తం ఒక 50 మంది దాకా పనిచేస్తున్నాము. లోపల జరిగేదొకటి బయట చూపించేది ఇంకొకటి. కొంత ఫేక్ కూడా ఉంది.. అలాగే కొంత రియాల్టీ కూడా ఉంటుంది ..ముఖ్యంగా ఇనయ ఎలిమినేషన్ తో టిఆర్పి రేటింగ్ కూడా పెరిగిపోయింది అంటూ కొన్ని విషయాలను చెప్పడంతో అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version