తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ అధికారులు పురోగతి సాధించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌కు చెందిన అధికారులు తాజాగా సీబీఐ డైరెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నట్లు సమాచారరం. కల్తీ నెయ్యి కేసు విచారణలో సేకరించిన సమాచారాన్ని సీబీఐ డైరెక్టర్‌కు వివరించారు.అసలు ఈ నెయ్యి ఏఆర్ డెయిరీ తయారు చేసింది కాదనే సంచలన విషయాన్ని వెల్లడించారు.
టీటీడీతో ఏఆర్ డెయిరీ సంస్థ ఒప్పందం మేరకు లడ్డూ తయారు చేసేందుకు అవసరమైన నెయ్యిని సరఫరా చేయాల్సి ఉంది. ఒప్పందానికి విరుద్ధంగా ఏఆర్ డెయిరీ నిర్వాహకులు వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి.. తమ ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు సిట్ అధికారుల విచారణలో తేల్చారు. లారీలు వెళ్లిన, టోల్ గెట్ వద్ద ఆగిన సమయాలు ఇలా అన్ని ఆధారాలను సిట్ అధికారులు పక్కాగా సేకరించినట్టు తెలిసింది. ఈ వివరాలను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది.