గ్రూప్-2 పరీక్ష.. ఆందోళన బాట పట్టిన అభ్యర్థులు

-

గ్రూప్ -2 పరీక్షలు నేడు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీజీపీఎస్సీ ఇప్పటికే పూర్తి చేసింది. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మరికొద్ది క్షణాల్లో పరీక్ష ప్రారంభం అవుతుందనే క్రమంలో..ఓ పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన వ్యక్తం చేశారు.

లగేజ్ కౌంటర్ వద్ద ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారని ఆరోపించారు.యాజమాన్యం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. సెల్ ఫోన్లు, లగేజ్ భద్రపరచడానికి రూ.50 వసూలు చేస్తున్నారని నిరుద్యోగ అభ్యర్థులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా..కాలేజీ యాజమాన్యం దురుసుగా జవాబిచ్చారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై తాము టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news