చాలామంది కామన్ గా వాడే పదం..నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, ఫేస్ వాల్యూ లేదు, రూపాయి సంపాదించిన మొఖమేనా అంటూ..పెద్దొళ్లు, అప్పడప్పుడు ఫ్రెండ్స్ తిడుతుంటారు. కానీ ముఖానికి రూపాయి ఏంటి..లక్షల్లో సంపాదించవచ్చు. రష్యాకు చెందిన ప్రోమోబోట్ సంస్థం మనిషి ముఖం మీద సర్వ హక్కులను కొనుగోలు చేస్తోంది. ఎందుకు అనుకుంటున్నారా..ఇప్పుడు అంతా రోబోటిక్ టెక్నాలజీ అయిపోతుంది. అయితే ఏపనికైనా రోబోలను వాడుతున్నారు..అలా తయారు చేస్తున్నారు..కానీ రోబోస్ లో మేల్, ఫీమేల్ మాత్రమే ఉన్నాయి కానీ..వాటని మనలాగే..అందంగా, ఒక్కో ఆకృతిలో లేవు అన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అయితే ఈ సంస్థం.. 2019 నుంచి హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తోంది.
అయితే, ఈ రోబోస్ తయారిని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓ ఉపాయాన్ని ఆలోచించింది. అదే మనిషి ముఖం, వాయిస్‌ల పేటెంట్ రైట్స్‌ను కొనుగోలు చేయటం. ఒకవేళ మనిషిలా రోబో మాట్లాడితే..ముఖం కూడా న్యాచురల్ గా ఉంటే..మరింత రియాలిస్టిక్ గా ఉంటుంది కదా..అందుకే ఈ సంస్థం.. ఈ రెండిటిని ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబో తయారు చేయాలని నిర్ణయించింది.
25 సంవత్సరాలు లేదా అంతకంటే పైబడిన వారు ఎవరైనా సరే మీ ముఖం, వాయిస్ రైట్స్‌ను ఈ సంస్థకు అందించొచ్చు. ఇందుకు రెండు లక్షల డాలర్లు (రూ.1,50,43,976) చెల్లిస్తామని సంస్థ ప్రకటించింది. అలా అని ముందుకు వచ్చిన అందరిని వీరు సెలెక్ట్ చేయరు. వివిధ పరీక్షల్లో ఎంపికైన వారి రైట్స్‌నే కొనుగోలు చేస్తారు. ఆ పరీక్షల్లో భాగంగా వంద గంటల ప్రసంగంతో పాటు, వివిధ ఫొటోషూట్‌లలో పాల్గొనాల్సి ఉంటుంది.. కొన్ని షరతులకూ అంగీకరించాల్సి ఉంటుంది. అన్నీ నచ్చితే ఇక మీరు కూడా మీ ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు.
మొత్తానికి ఈ ఐడియా బానే ఉంది కానీ..కండీషన్స్ హే కొంచెం క్రిటకల్ గా ఉన్నాయి..మరి ఊరికే అంత డబ్బు ఇస్తారా ఏంటి..భవిష్యత్తులో అన్నీ రోబేస్ హ్యూమనాయిడ్ అయి..మనలానే మాట్లాడితే ఆరోజు దగ్గర్లోనే ఉంది.