నా చంద్రన్న, నా రేవంత్ అన్న రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలా కాపాడ డాలి : సినీ నటుడు బండ్ల

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల బంధంపై ప్రముఖ నటుడు, కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేష్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ కలిసి ఉండాలని బండ్ల గణేష్ ఆకాంక్షించారు. ‘పదవులు, హోదాలు, డబ్బులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ బంధం అనేది విడదీయరానిది అని అన్నారు. నా చంద్రన్న, నా రేవంత్ అన్న రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇలానే ఉండాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబుకు ట్యాగ్ చేశారు.

దీంతో.. ఈ పోస్ట్ పై సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా… “మీ నుంచి చాలా నేర్చుకోవాలన్నా” అని గణేష్ ని ఉద్దేశించి ఒకరు కామెంట్ పెడితే… మరికొంతమంది రేవంత్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి విషయాలను ప్రస్థావిస్తున్నారు! మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నేత.. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని కోరుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు! ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news