దేవర మూవీ ప్రీ పోన్… స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఇదిలా ఉంటే ఈ మూవీని మేకర్స్ దసరా కానుకగా అక్టోబర్ 10 న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.అయితే దేవర సినిమా ప్రీ పోన్ కానున్నట్లు బాగా వార్తలు వినిపించాయి.తాజాగా ఈ చిత్రాన్ని ప్రీ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.ఈ పోస్టర్ లో దేవర సినిమాను సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా న‌టిస్తుంది విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేయ‌గా….. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.తారక్ ఈ మూవీ లో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news