విశాఖలోని వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. 2003లో నిర్మితమైన ఈ స్టేడియంలో ఈ టెస్ట్ మ్యాచ్ మూడోది కానుంది.రెండో టెస్టు కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు విశాఖ ఇప్పటికే చేరుకున్నాయి.అయితే రేపు విశాఖలో 2వ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో భరత్ మాట్లాడుతూ ….సొంత ప్రేక్షకుల ముందు క్రికెట్ ఆడనుండటం గర్వంగా ఉందని యువ క్రికెటర్ కేఎస్ భరత్ అన్నారు. ‘దేశం కోసం ఆడేటప్పుడు ప్రోత్సహించేవారితో పాటు నిరుత్సాహపరిచేవారు కూడా ఉంటారు. మా దృష్టి మాత్రం ఆటపైనే ఉంటుంది’ అని భరత్ పేర్కొన్నారు.ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన భరత్ ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయితే వైజాగ్ లోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో టీమ్ ఇండియాకు మంచి రికార్డు ఉంది. ఆ స్టేడియంలో ఇప్పటి వరకు 2 టెస్టులు జరగ్గా రెండింట్లోనూ భారత్ గెలిచింది. ఒకసారి సౌతాఫ్రికాను, మరోసారి ఇంగ్లండ్ ను ఇండియా ఓడించింది. రెండుసార్లు ఇండియా మొదటి బ్యాటింగ్ చేసింది.