ఉదయగిరి టీడీపీలో నాలుగు స్తంభాలాట.. అయోమయంలో క్యాడర్..

-

ఉదయగిరి టిడిపిలో టిక్కెట్ కోసం నలుగురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు.. టికెట్ తమకంటే తమకంటూ అనుచరుల వద్ద ముఖ్య నేతల వద్ద ప్రస్తావిస్తున్నారు.. దీంతో నియోజకవర్గంలో నాలుగు స్తంభాలాట కొనసాగుతోంది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో టికెట్ ఎవరికి వస్తుందో అర్థం కాక టిడిపి క్యాడర్ అయోమయంలో పడింది..

ఎన్నికలకు నెల రోజులు ముందు అభ్యర్థిని ఖరారు చేయడం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా మారింది.. ప్రతిసారి చివరి నిమిషంలో అభ్యర్థిని ఖరారు చేస్తూ ఉండటంతో జనాల్లోకి వెళ్లలేక.. ఫండింగ్ అడ్జస్ట్ చేసుకోలేక అభ్యర్థులు ఓటమి ఫాలో అవుతున్నారు.. ఉదయగిరి నియోజకవర్గం లో కూడా అదే జరుగుతుంది.. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తో పాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి టిడిపి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో టిడిపి నుంచి ఎవరికి టికెట్ వస్తుందో తెలియక క్యాడర్ మొత్తం అయోమయంలో పడిపోయింది.. టికెట్స్ ఆశిస్తున్న నలుగురులో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగిలిన ముగ్గురు సహకరించే పరిస్థితి లేదు.. దీంతో ఆశావాహుల అనుచరులు సైతం అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడంతో.. ఆయన ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు, ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.. కానీ టిడిపి మాత్రం డైలమాలో ఉంది.. ఇలాంటి సమయంలో అభ్యర్థిని ఖరారు చేసినప్పటికీ.. గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని.. ఆ పార్టీకి చెందిన నేతలే చర్చించుకుంటున్నారు.. ఒక టికెట్ కి నలుగురు పోటీ పడడంతో ఈ దుస్థితి ఏర్పడిందంటూ సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.. మొత్తంగా ఉదయగిరి టిడిపిలో మాత్రం గందరగోళ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news