పోలీసుల అదుపులో సైకో కిల్లర్.. ఏకంగా 16 మందిని ?

-

రాచకొండ  పోలీసులు సైకో కిల్లర్ ని అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. జూబ్లీహిల్స్ కు చెందిన వెంకటమ్మ అనే మహిళను సైకో కిరతంగా హత్య చేశారు. వెంకటమ్మ  మొహం పై పెట్రోల్ పోసి సైకో హత్య చేసినట్టు చెబుతున్నారు. 20 రోజుల పాటు కేస్ దర్యాప్తు చేసి కీలక క్లూస్ రాబట్టిన రాచకొండ పోలీసులు, బొరబండ కు చెందిన వ్యక్తి హత్య చేసినట్టు గుర్తించారు.

ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి సైకో హత్య చేస్తున్నట్టు గుర్తించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు తమ దైన శైలిలో విచారణ చేశారు. ఈ విచారణలో తాను 16 మంది మహిళలను హత్య చేసినట్టు సైకో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కల్లు దుకాణాలు , మద్యం షాప్ వద్ద ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్న సైకో వారిని మాటల్లో పెట్టి తీసుకు వెళ్లి చంపెస్తున్నట్టు గుర్తించారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version