మహబూబాబాద్ జిల్లాలో వీరంగం సృష్టించిన సైకో..

-

మహబూబాబాద్ జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఒంటి మీద చొక్కా లేకుండా ఒళ్లంతా గాయాలతో బయట తిరుగుతూ స్థానికులను భయాందోళకు గురిచేశాడు. కే సముద్రం మండలం ఇంటికన్నె సమీపంలో ఈ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి.. తనను తాను పొడుచుకుని హల్ చల్ చేశాడు.

పొత్తి కడుపు, తల, చేతులపై తనను పొడుచుకుని గాయపరుచుకున్న సైకో బహిరంగంగా వీరంగా సృష్టించాడు. అతడిని చూసి భయపడిన స్థానికులు తమపై దాడి చేస్తాడేమోనన్న భయంతో దూరంగా పరుగులు తీశారు. అతడిని పట్టుకునేందుకు వెళ్లిన స్థానికులపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ సైకోను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version