నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై నిర్ణయం!

-

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. ఇందులో కీలక అంశాలు చర్చకు వచ్చే చాన్స్ కనిపిస్తుంది.ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలతో పాటు, వారి సమస్యలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జీవో నెం.317 అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇక మూసీ బాధితులకు ఇచ్చే పరిహారంపై కూడా మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీ కుల గణన, కొత్త ఆర్వోఆర్ చట్టంపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటారని టాక్. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ ఉండనుందని తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు కట్టబెడుతూ పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మున్సిపల్ యాక్ట్ చట్ట సవరణ బిల్లు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు, కొత్త రేషన్ కార్డు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతుభరోసా స్కీమ్‌పై కేబినెట్ చర్చ జరగనుంది.ఈ నెలాఖరు లోపు రుణమాఫీ కాని రైతులకు ఈ పథకం వర్తింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version