ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు, శ్రవణ్‌లకు బిగ్‌ షాకిచ్చిన సీబీఐ!

-

గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్వహించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ సర్కార్ వెలుగులోకి రావడంతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ తతంగం నడిచిందని ఇప్పటికే విచారణలో తేలింది. ఈ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు తాజాగా ఊహించని షాక్ తగిలింది.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న వీరిద్దరి పాస్ పోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ పరారీలో ఉండగా..వారి పాస్ పోర్టుల్ని రద్దు చేయాలని పాస్ పోర్టు ఆఫీసుకు పోలీసులు లేఖ రాశారు. ఈ మేరకు అధికారులు వారి పాస్ పోర్టులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు అమెరికా పోలీసులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరిపైనా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.అంతేకాకుండా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు సీబీఐ అధికారులు ఇంటర్ పోల్‌కు నివేదిక పంపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version