వన్యప్రాణులపై సైకోల జులూం.. కోతిని చిత్రవధ చేసి..!

-

వన్యప్రాణులపై దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా హింసలు పెరిగాయి. కేరళలో ఏనుగు ఆశ చూపించి, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో కోతికి ఉరి వేసి, మెదక్ ఏడుపాయల వద్ద ఉడుమును సజీవంగా కాల్చిన ఘటనలు ఈ మధ్య కాలంలో చూస్తునే ఉన్నాం. ఈ ఘటనలపై జంతు ప్రేమికులు ఆందోళనలు చేస్తున్నా.. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరొక దారుణం చోటు చేసుకుంది.

Psycho

కొందరు వ్యక్తులు ఓ కోతిని కింద పడేసి కర్రతో కొడుతూ.. పిన్నులతో గుచ్చుతూ శునకానందం పొందుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోతిని చిత్రవధ చేసి చివరకు నలుపు రంగు పోసి వడిచి పెట్టారు ఆ సైకోలు. దీంతో ఆగ్రహించిన జంతు ప్రేమికులు అక్కడి ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీడియో ఆధారంగా పోలీసులు ఆ నలుగురిని పట్టుకుని అరెస్ట్ చేశారు. కోతిని హింసించినందుకు పోలీసులు జరిమానా విధించారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version