సెక్స్ చాట్ తో విద్యార్థినిలను వేధించిన సైకాలజిస్ట్.. 16 రోజుల జైలు శిక్ష!

-

సెక్స్ చాట్‌తో పాఠశాల, ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థిని లను వేధించినందుకు సైకాలజిస్ట్‌కు 16 రోజుల జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు. గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన నగేష్ వయస్సు (42) సైకాలజిస్ట్ (అతిథి అధ్యాపకులు) మాదాపూర్‌లోని హాస్టల్‌లో ఉంటున్నారు. సైకాలజిస్ట్‌గా హైదరాబాద్‌లోని అనేక ప్రసిద్ధ కళాశాలల్లో కౌన్సెలింగ్ తరగతులు నిర్వహించేవారు.

తరగతుల సమయంలో విద్యార్థులకు మోటివేషనల్ కొటేషన్లు పంపిస్తానని… ఆసక్తి ఉన్నవారు తనకు మెసేజ్ చేయమని చెప్పి తన నంబర్‌ను విద్యార్థులకు ఇచ్చేవాడు. ఒకసారి ఎవరైనా అమ్మాయి లేదా మహిళలు అతనిని సంప్రదించినట్లయితే… అతను వారితో సెక్స్ చాట్ చేస్తూ వారిని వేధించడానికి ప్రయత్నిస్తాడు. అయితే కాలేజీల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో సాధికారత సాధించిన కొందరు విద్యార్థినులు హైదరాబాద్ షీ టీమ్‌ను సంప్రదించడంతో… నిందితుడి వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది.

విద్యార్థినుల వివరాలను గోప్యంగా ఉంచిన షీ టీమ్ సభ్యులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన మూడో ప్రత్యేక న్యాయమూర్తి నిందితుడికి పదహారు రోజుల జైలుశిక్షతో పాటు జరిమానా విధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version