ప్రముఖ మొబైల్ గేమ్ పబ్‌జికి చెందిన మాతృసంస్థ పబ్‌జి కార్ప్ చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్‌తో ఉన్న సంబంధాలను పూర్తిగా కట్ చేసుకున్న విషయం విదితమే. టెన్సెంట్‌తో ఉన్న రిలేషన్ వల్ల పబ్‌జి గేమ్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. చైనా ముద్ర ఉండకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే భారత్ అనేక యాప్‌లను నిషేధించగా.. వాటిలో పబ్‌జి కూడా ఉంది. అయితే గేమ్‌ను భారత్‌లో తిరిగి రీఎంట్రీ ఇప్పించేందుకు పబ్‌జి కార్ప్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే టెన్సెంట్‌తో తెగతెంపులు చేసుకుంది. ఇక భారత్‌లో ఆ సంస్థ కొత్త పార్ట్‌నర్ కోసం వెదుకుతోంది.
కాగా రిలయన్స్ జియోతో కలిసి పబ్‌జి కార్ప్ భారత్‌లో గేమ్‌ను యూజర్లకు అందించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పబ్‌జి కార్ప్ జియోతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. దీని వల్ల జియోకు భారత్‌లో పబ్‌జి గేమ్‌కు గాను పబ్లిషింగ్, పంపిణీ హక్కులు ఉంటాయి. ఇలా జియోతో జట్టు కట్టడం వల్ల గేమ్‌ను తిరిగి భారత్‌లో అందుబాటులోకి తేవచ్చని పబ్‌జి కార్ప్ భావిస్తోంది.
అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. గేమ్‌లో యూజర్ల డేటాకు సంబంధించి పబ్‌జి కార్ప్ స్పష్టతనివ్వలేదు. ఎందుకంటే గేమ్ పై ఉన్న నిషేధాన్ని తొలగించాలంటే అది కూడా ఓ ముఖ్య కారణమే. యూజర్ల డేటాను ఇండియాలో స్టోర్ చేసేట్లయితేనే గేమ్‌పై ఉన్న నిషేధాన్ని భారత ప్రభుత్వం తొలగించేందుకు అవకాశం ఉంటుంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాంటప్పుడు జియోతో పార్ట్‌నర్‌షిప్ ఏర్పాటు చేసుకున్నా గేమ్ తిరిగి అందుబాటులోకి వస్తుందన్న గ్యారంటీ లేదు. మరి పబ్‌జి కార్ప్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో, గేమ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేలా ముందుకు అడుగులు వేస్తుందో, లేదో చూడాలి.