ఆంధ్రప్రదేశ్లో గత రెండు మూడు రోజుల నుంచి అంతర్వేది రథం దగ్ధం ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విపక్షాలు మాత్రం దీని వెనుక కచ్చితంగా వైసీపీ నేతలు ఉన్నారు అని ఆరోపణలు చేస్తున్నాయి. హిందుత్వ వాదులు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ తేలికగా తీసుకుంటున్నారని హిందూత్వవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ కఠిన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో అనవసరంగా ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
అది పక్కనపెడితే ఇప్పుడు జరిగిన సంఘటనపై తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు స్పందించడమే ఇక్కడ చాలా మందిని విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఒక ట్వీట్ చేసి వదిలేస్తే ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం పదేపదే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని విమర్శించడం వంటివి చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. వాస్తవానికి అది హిందూత్వవాదులు కు సంబంధించిన విషయం కాబట్టి వారు ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ తెలుగుదేశం ఏ సంబంధం లేకపోయినా చంద్రబాబు నాయుడు దానిని అజెండాగా తీసుకుని విమర్శలు చేస్తున్నారు.
దేనితో ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఎదురు దాడి చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో హిందుత్వ వాదం పెంచి పోషించడానికి గాను బిజెపి ప్రయత్నాలు చేస్తుంటే దానికి చంద్రబాబు నాయుడు పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ఎక్కువగా విమర్శలు చేసి బిజెపి అధిష్టానం మెప్పు పొందాలని అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా లకు దగ్గర కావాలి అనే భావన లోనే చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని భుజానికెత్తుకుని ఆరోపణలు చేస్తున్నారని పలువురు పరిశీలకులు అంటున్నారు.
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా కూడా ఈ వ్యవహారాన్ని కాస్త ఎక్కువగా చేసి చూపించే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో జరిగిన సంఘటనలు అదేవిధంగా ప్రస్తుతం జరిగిన సంఘటనను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎక్కువగా చేస్తోంది. దీంతో వైసిపి చంద్రబాబు నాయుడు టార్గెట్గా విమర్శలు చేస్తూ అసలు ఆ ఘటనకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అండ్ కో అనే ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు.
‘తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు.’ అని విజయసాయి రెడ్డి తన ట్వీట్లో ఆరోపించారు. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అండ్ కో సైలెంట్ అవ్వడమే మంచిది అనే భావన ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.
తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 9, 2020