మీకు తెలుసా? కార్తీక మాసం ముగిసిన వెంటనే వచ్చే ఒక పవిత్రమైన రోజు ‘పోలీ పాడ్యమి’. ఈ రోజుకు ఎంతో ప్రత్యేకమైన ధార్మిక శక్తి ఉంది. ఈ పాడ్యమి రోజున ఒక అద్భుతమైన కథ దాగి ఉంది దీనిని చదివినా లేదా విన్నా సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కోసం ఎదురుచూసే వారికి ఈ రోజు అత్యంత శుభప్రదం. ఆ అద్భుతమైన కథ ఏంటి? ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం.
కార్తీక మాసం..శివకేశవుల ప్రసన్నత దొరికే పవిత్రమైన కాలం. ఈ నెలలో(నవంబర్ 21 శుక్రవారం) చేసే ప్రతి దీపారాధన, ప్రతి స్నానం, ప్రతి పూజ మన జీవితాల్లో శుభఫలితాలు నింపుతాయని పురాణాలు చెబుతాయి. అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి రోజున జరుపుకునే “పోలి పాడ్యమి” ఇలాంటి ఎన్నో మహిమలు కలిగిన పర్వదినం. ఈ రోజున నదుల్లో చెరువుల్లో దీపం వదలడం ఎంతో పుణ్యం. దీపజ్యోతి ద్వారా మన కర్మలన్నీ శుద్ధి చెందుతాయంటారు.
ఆ రోజున పఠించాల్సిన ఒక అతి పవిత్రమైన కథ..పోలి కథ. ఇది వినేవారికి మాత్రమే కాదు హృదయపూర్వకంగా ఆచరించేవారికి మహా శుభఫలితాలు ఇస్తుందని స్కందపురాణం చెబుతోంది.

ఒక చాకలి అమ్మకు నలుగురు కోడళ్ళు. కార్తీక మాసమంతా ముగ్గురు కోడళ్ళను తీసుకొని ఆమె నదీ స్నానానికి వెళ్లేది. కానీ చిన్న కోడలు పోలి… ఆమెను మాత్రం తీసుకెళ్ళేది కాదు.“పేదది… ఇంటి పనులే చేస్తే సరిపోతుంది” అన్నట్లుగా ఆమెను నిర్లక్ష్యం చేసేది. కానీ పోలి హృదయం మాత్రం ఎంతో పవిత్రం. దీపం పెట్టడానికి ఏదీ లేకపోయినా, వంటగదిలో మిగిలిన కొద్దిపాటి వెన్న, పెరట్లోని పత్తి మొక్క నుంచి తీసుకున్న చిన్న కాడ…అన్నీ కలిపి భక్తిశ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించింది.
నది దగ్గరికి వెళ్లలేకపోయినా, ఇంటి పక్కనే ఉన్న బావి వద్ద స్నానం చేసింది. ప్రాణాభక్తితో ఆ చిన్న దీపాన్ని వెలిగించి“ఈ దీపజ్యోతి నా భక్తిని స్వీకరించాలి” అని హృదయంలో ప్రార్థించింది. అలా చేసిన క్షణం..ఆకాశం నుంచే దేవదూతల విమానం దిగింది. దీపాన్ని రక్షిస్తూ పోలి ముందుకు సాగింది… భక్తిశక్తి ముందుంటే దివ్యలోకం కూడా చేరదవుతుంది అన్నట్లు, పోలిని శరీరంతో సహా స్వర్గానికి తీసుకెళ్లారు. ఆ దృశ్యం చూసి మూడు కోడళ్ళు, అత్తగారు ఆశ్చర్యానికి గురయ్యారు. పోలిని పట్టుకొని తమతో వెళ్లాలని చూసారు. అప్పుడే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు.
“మీరు శ్రద్ధ లేకుండా చేశారన్నది మీ పుణ్యఫలితం… కానీ ఈ పోలి మాత్రం ఆత్మశ్రద్ధతో, భక్తితో దీపం వెలిగించింది. అందుకే ఈమెను శశరీరంగా స్వర్గానికి తీసుకువెళ్తున్నాను” అని కరుణతో చెప్పారు. వెంటనే
అత్తగారికి, ముగ్గురు కోడళ్ళకు శాపమిచ్చి,“ఇంత నిస్సహాయంగా వదిలిన పోలిలా మీరు అడవుల్లో పోలై తిరుగుతారు” అని చెప్పారు.
పోలిమాత కథను భక్తిగా విని, అక్షింతలు వేసుకుంటే, కార్తీకమాసమంతా పురాణపఠనం చేసిన ఫలమే లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మనసులో భక్తి ఉంటే చిన్న దీపమూ స్వర్గద్వారాలు తెరుస్తుందనే సందేశమే ఈ కథ.
