నేడు పల్స్ పోలియో… చుక్కలు వేయించడం మర్చిపోకండి సుమీ..!

-

రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఆదివారం పల్స్‌ పోలియో చుక్కలు వేయనున్నారు. జాతీయ రోగనిరోధక దినోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ వి.గీతాప్రసాదిని తెలిపారు. ఇందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఏర్పాట్లు చేసుకున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు జోరుగానే సాగాయి. ఏపీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా… ఆయన ఇంట్లోనే నేటి ఉదయం 10.45కి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యాప్తంగా 52.27 లక్షల మంది పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేస్తారు. ఇందుకోసం 1.49 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు.

37,493 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. ప్రయాణంలో ఉండే వారి కోసం 1354 మొబైల్ బృందాల్ని బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, మెయిన్ సెంటర్లలో ఉంచారు. ఇవాళ వ్యాక్సిన్ తీసుకోలేకపోయిన పిల్లల కోసం 20 నుంచి 22 వరకు ఇంటింటికీ సిబ్బంది వెళ్లి మరీ పోలియో చుక్కలు వేస్తారు. ఈ రోజుల్లో మన దేశంలో కొత్తగా పుట్టేవారికి పోలియో రావట్లేదు. అయినప్పటికీ… ఎందుకైనా మంచిదని పోలియో చుక్కల్ని తప్పనిసరిగా వేయిస్తున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో సోకితే… ఆ వైరస్‌ను తట్టుకునే వ్యాధినిరోధక శక్తి వారికి ఉండదు. అందుకే వ్యాక్సిన్ వేయిస్తున్నారు. సో.. మీరు కూడా మీ పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు వేయించ‌డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version