పునర్నవి పెళ్లి చేసుకునేది చికాగో సుబ్బారావునట !

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం ఎట్టకేలకు పెళ్లి కబురు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ముందు ఆ అబ్బాయి ఎవరో చెప్పకుండా చేయి మాత్రమె చూపించిన ఆమె ఇప్పుడు మాత్రం టోటల్ క్లారిటీ ఇచింది. ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. సినీ ఇండస్ట్రీకి సంబందాలు ఉన్న వ్యక్తినే. అతడి పేరు ఉద్భవ్ రఘునందన్ అతను ఒక యూట్యూబర్. వైరల్లీ వాళ్లకి చెందిన చికాగో సుబ్బారావు అనే చానల్ లో అయన వీడియోలు చేసేవారు.

ఇక ఆయన ఇంస్టా బయోలో నటుడు. రచయిత, ఫిలిం మేకర్ గా చేస్తున్నానని పేర్కొన్నాడు. ఇక ఈయన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియనప్పటికీ అతడు ప్రపోజ్ చేస్తే పున్ను ఓకే చెప్పిందని అంటున్నారు, అంతే కాదు పెళ్లి గురించి పూర్తి వివరాలు రేపు చెబుతానంటూ పోస్ట్ పెట్టింది. తనకు కాబోయే భర్త ఫోటో కూడా షేర్ చేసింది. నేను ఎస్ చెప్పాల్సి వచ్చింది. అతడే నాకు కాబోయే వాడు.. అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది పున్నూ.

 

View this post on Instagram

 

I had to say yes 🙃 @itsudbhav and I will tell you all about our BIG DAY tomorrow🙈

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on