దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి : రాహుల్‌

-

బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ సారి తెలంగాణలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. అభివృద్ధి అనే గ్యారంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. బీఆర్ఎస్‌కు రోజులు చెల్లాయని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్ అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వేల కోట్లు జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇస్తామన్న మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఎవరికి అయిన వచ్చాయా అని ప్రశ్నించారు.

పోడు భూములపై ఆదివాసీలకు హక్కుల కల్పిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీల బిల్లు ఆమోదించాం. కాంగ్రెస్ ఇస్తున్న హామీలను నిలబెట్టుకుంటుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తాం. కరెంట్ బిల్లుల్లో 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4 వేల పింఛన్ ఇస్తాం. యువతీ యువకులకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. సమ్మక్క-సారలమ్మ ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేస్తాం. కుంభమేళా తరహాలో చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ ఉత్సవంగా చేస్తాంఅని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version