వాకింగ్ కు వెళ్ళిన వాళ్ళకు యోగా శిక్ష వేసిన పోలీసులు…!

-

లాక్ డౌన్ సమయంలో బయటకు రావొద్దు అని పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా జనాలు మాత్రం వినడం లేదు. దీనితో పోలీసులు కాస్త సీరియస్ గానే ఉంటున్నారు. అయితే పూణే పోలీసులు మాత్రం బయటకు వచ్చిన వాళ్ళ విషయంలో కాస్త వినూత్నంగా ఆలోచించారు. కోవిడ్ -19 లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి ఉదయం వాకింగ్ కి వెళ్ళే వారికి గానూ పూణే పోలీసులు గురువారం ఆరోగ్యకరమైన శిక్షను విధించారు.

25 నుంచి 30 మంది ఉదయం నడిచేవారితో సహా 100 మందిని కొంధ్వా పోలీస్ స్టేషన్ సిబ్బంది యోగా వ్యాయామం చేయించారు. “ఉదయాన్నే నడిచేవారితో పాటు, ఉదయాన్నే వారి ఇంటి నుండి అవసరమైన వస్తువులను కొనడానికి బయలుదేరిన వ్యక్తులను కూడా మేము పట్టుకున్నాము” అని కొంధ్వా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ వినాయక్ గైక్వాడ్ మీడియాకు వివరించారు.

సామాజిక దూరం పాటిస్తూనే వారికి పోలీసులు ఈ శిక్ష విధించడం గమనార్హం. యోగా తో మాత్రమే పరిమితం కాలేదు. మరికొన్ని వ్యాయామాలు కూడా చేయించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 కింద వాకింగ్ కి వెళ్ళే వారిపై కేసులు నమోదు చేయనున్నారు పోలీసులు. కాగా మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం పూణే. ముంబై తర్వాత ఇక్కడే అత్యధిక కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version