కరోనా వైరస్ కట్టడిలో ఓడిస్సా సర్కార్ వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఆ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంటుంది. అక్కడ కనీసం తినడానికి తిండి ఉండకపోవడమే కాకుండా జనాలకు కనీస రవాణా సౌకర్యాలు ఉండవు. అయినా సరే ఆ రాష్ట్రం కరోనా కట్టడి విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. గత రెండు రోజులలో ఒడిశాలో తాజా కోవిడ్ -19 కేసులు నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఒడిశాకు ఇప్పటివరకు ఏప్రిల్ 16 న ఉదయం 12 గంటల వరకు మొత్తం 6,734 నమూనాలను సేకరించారు. ఇప్పటి వరకు వీటిల్లో 60 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ అని పేర్కొన్నారు. ఏప్రిల్ 14 తర్వాత అక్కడ ఒక్క కేసు కూడా రాలేదు. మొత్తం బుధవారం 1197 నమూనాలను పరీక్షించారు అక్కడి వైద్యులు.
ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల శాతం 0.89 శాతంగా ఉంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో 40 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ప్రాణాంతక వైరస్ బారిన పడిన 19 మంది కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ రాష్ట్రంలో కరోనాతో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలావుండగా, ఒడిశాలోని 21 జిల్లాల్లో 3,951 పడకలు, 293 ఐసియు పడకల సామర్థ్యంతో 24 కోవిడ్ -19 ఆస్పత్రులు పనిచేస్తున్నట్లు అభివృద్ధి కమిషనర్ సురేష్ మోహపాత్రా తెలిపారు.