కాంగ్రెస్ అధిష్టానంపై సిద్దూ హాట్ కామెంట్స్… బలహీన వ్యక్తుల్నే సీఎంలుగా కోరుకుంటారు అంటూ..

-

పంజాబ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అంతర్గతంగా పంజాబ్ పీసీసీ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.. సీఎం చన్నీ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సిద్దూ తాజాగా కాంగ్రెస్ అధిష్టానంపై హాట్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా కాంగ్రెస్ హైకమాండ్ పై అటాక్ చేశారు. బలహీన వ్యక్తుల్నే పార్టీ పెద్దలు ముఖ్యమంత్రిగా కోరుకుంటారని.. వారి ట్యూన్లకు డ్యాన్స్ చేసే వారినే సీఎం అవ్వాలనుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ జీత్ సింగ్ చన్నీనే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ.. పంజాబ్ మాజీ పీసీసీ ఛీఫ్ వ్యాఖ్యలు చేసిన అనంతరం సిద్దూ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.

సిద్దూ ఎప్పటి నుంచో పంజాబ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంలో సక్సెస్ అయ్యాడు సిద్దూ. అయితే తాను అనుకున్నట్లుగా సీఎం పీఠం రాలేదు. కాంగ్రెస్ అధిష్టానం చన్నీని ముఖ్యమంత్రిగా చేసింది. అప్పటి నుంచి పార్టీపై తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. గతంలో కూడా ముఖ్యమంత్రిని ప్రజలు నిర్ణయిస్తారని… హైకమాండ్ కాదంటూ వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version