ఏపీలో పీఆర్సీ సమస్య ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణకు కారణమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీ తమకు సమ్మతంగా లేదని ఉద్యోగ సంఘాలు నిరసన, ఆందోళనలు చేపట్టాయి. నిన్న లక్షలాది మందితో ఛలో విజయవాడ కూడా సక్సెస్ అయింది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. ఉద్యోగులను కోరతుంది.
ఇదిలా ఉంటే పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేతలు సమావేశం అయ్యారు. సీఎస్ సమీర్ శర్మ, ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి శశిభూషన్ కామెంట్లపై చర్చించనున్నారు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లాలా.. వద్దా..అనే అంశంపై సమాలోచన చేయనున్నారు. ఉద్యమ కార్యచరణపై పీఆర్సీ సాధన సమితి నేతలు సమీక్ష జరుపనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ కు పిలుపునిచ్చారు. తాజాగా సచివాలయ ఉద్యోగులు పెన్ డౌన్, సిస్టమ్ డౌన్ చేసి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు తమ డిమాండ్ల నెరవేర్చకుంటే… ఈనెల 7 నుంచి సమ్మెలోకి వెళ్తామని ఇదివరకు ప్రభుత్వానికి నోటిసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.