ఈ సినిమాలో నటించినందుకు ఎంతో ఆనందంగా ఉంది…బండ్ల గణేష్..!

-

బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారారు. ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత అనేక మంది టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలను కూడా నిర్మించారు. అయితే గత కొద్ది కాలంగా బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బండ్ల గణేష్ ఆఖరుగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బండ్ల గణేష్ ‘డేగల బాబ్జి’ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇదివరకే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమాలోని లిరికల్ వీడియో ను బండ్ల గణేష్ కూతురు ద్రిష్టి విడుదల చేసారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్ ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి,హరీష్ శంకర్ గారికి బండ్ల గణేష్ ధన్యవాదాలు తెలిపారు. తమిళం లో పార్థీబన్ చేసిన “ఉత్త సిరుప్పు సైజు 7” నేషనల్ అవార్డు వచ్చింది. ఆ మూవీ ని తీసుకున్నాను అని నా స్నేహితుడు వెంకట్ చంద్ర నాకు చెప్పడం జరిగింది.

 

వెంకట్ చంద్ర తో నాది 20 సంవత్సరాల స్నేహం. తెలుగులో ఈ సినిమాను ఏ స్టార్ హీరో చేసిన బాగుంటుంది అని అనుకున్నాను. అయితే అనూహ్యంగా ఈ మూవీ లో నన్ను నటించమని చెపితే..నేను యాక్ట్ చేయడమేమిటి..నేను యాక్టింగ్ మర్చిపోయాను అని అన్నాను. తమిళ్ లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసిన తను ఎక్కడ.. నేనెక్కడ.. నేను చేయలేను.. అయినా నేనిప్పుడు సినిమా తీద్దామను కుంటున్నాను యాక్ట్ చేయను అని చెప్పాను. అయితే కథ చాలా బాగుంది అని నన్ను కన్విన్స్ చేయడంతో ఈ మూవీ చేయడానికి నేను ఒప్పుకున్నాను అని బండ్ల గణేష్ తెలియజేశాడు.

ఒకే రూమ్ లో ఒకే క్యారెక్టర్ ని రెండు గంటల సేపు చేయడం చాలా రిస్క్. అలాంటి కథను నా భుజాలపై పెట్టి చేయించారు అని బండ్ల గణేష్ అన్నారు. మూవీ చేసే వరకు నాలో గుండె దడ దడ కొట్టుకునేది, భయమేసేది. మూవీ చేసే క్రమంలో నేను చేయగలననే ధైర్యం వచ్చింది. మూవీ అంతా పూర్తి అయిన తర్వాత చూసుకుని నేనే ఆశ్చర్యపోయాను అని బండ్ల గణేష్ తెలియజేశాడు. నేనేనా ఇలా నటించింది అని నాలో నేనే నాకు ఆనందం వేసింది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసినప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో ఈ డేగల బాబ్జి సినిమాలో నటించినందుకు కూడా అంతే సంతోషంగా ఉంది అని బండ్ల గణేష్ తెలియజేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version