పంజాబ్ కాంగ్రెస్ లో ప్రకంపనలు.. పీసీసీ పదవికి సిద్దూ రాజీనామా..!

-

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అత్యంత ఘోరంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రీతిలో ఓడిపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పంజాబ్ లో ఆప్ ధాటికి కాంగ్రెస్ నిలవలేకపోయింది. కేవలం 117 స్థానాలు ఉన్న పంజాబ్ లో కేవలం 17 స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ఆప్ ధాటికి ఓడిపోతున్నారు. అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ సిద్దూ ముందంజలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహించి పీసీసీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీ కూడా.. తాను పోటీ చేస్తున్న భదౌర్ తో పాటు చమ్కౌర్ సాహిబ్ స్థానాల్లో కూడా వెనుకంజలో ఉన్నారు.

పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికీ రాజీనామా చేసేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. “ప్రజల స్వరం భగవంతుని స్వరం…. పంజాబ్ ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరించండి…. ఆప్‌కి అభినందనలు !!!” పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. మరోవైపు పంజాబ్ గవర్నర్ ని కలిసి రాజీనామా చేయనున్నారు సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version