ప్రధాని భద్రత అంశంపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం… స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు.

-

పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ పర్యటనలో ప్రధానమంత్రి భద్రతా లోపంపై సుప్రీం కోర్ట్ లో వాదనలు జరిగాయి. సుప్రీం కోర్ట్ త్రిసభ్య ధర్మాసనం.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు విన్నారు. మోదీకి భద్రత కల్పించడంతో డీజీపీ విఫలం అయ్యారని.. కేంద్రం ఆరోపించింది. మోదీ కాన్వాయ్ కు వంద మీటర్ల దూరంలోనే ఆందోళనలు జరిగాయని.. అయినా పోలీసులు అడ్డుకోలేదని సుప్రీం కోర్ట్ కు తెలిపింది కేంద్రం. ఇది పూర్తిగా పంజాబ్ ప్రభుత్వ వైఫల్యమే అని కేంద్రం వాదించింది. ఇదిలా ఉంటే పంజాబ్ ప్రభుత్వం కేంద్రం వాదనలను తప్పు పట్టింది.

ప్రధాని భద్రత లోపంపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని భద్రతపై విచారిస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన అన్ని కమిటీల విచారణను నిలిపివేయాలని ఆదేశించింది.  ఓ స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర కమిటీలో డీజీపీ చండీగఢ్, ఐజీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ ఏడీజీపీ (సెక్యూరిటీ)లను చేర్చాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఈ స్వతంత్ర కమిటీనే పంజాబ్ లో ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version