వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు !

-

బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నిన్న నియమించబడిన దగ్గుబాటి పురంధేశ్వరి కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ మిగతా రాజకీయ పార్టీల కన్నా భిన్నమైన పార్టీ అన్న ఆమె, పార్టీలో కష్టించే వారిని గుర్తించి సరైన ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. నాపై నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన జాతీయ అధ్యక్షులు నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా లకు ధన్యవాదాలు తెలిపిన ఆమె పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి రావటం కన్నా ఆ పదవికి న్యాయం చేసినప్పుడే ఆనందం కలుగుతుందని అన్నారు. నాకు లభించిన పదవిని పడవిగా కన్నా భాద్యత గానే భావిస్తున్నానని ఆమె అన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలోకి రావడమే లక్ష్యమన్న ఆమె ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అందరితో కలసి కృషి చేస్తానని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కావడానికి ప్రధాని మోదీ రైతు బిల్లులను తీసుకు వచ్చారని, రైతు పథకాల అమలు ద్వారా వారికి భరోసా ఏర్పడుతుందని అన్నారు. రైతులు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారామే. అలానే భవిష్యత్తులో పొత్తుల విషయం భవిష్యత్తే తేలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని, రాజధాని విషయంలో కేంద్రం పాత్రపై గతంలో రాంమాధవ్ స్పష్టంగా వివరించారని తాము రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉన్నామని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version