సర్పంచ్‌లకు న్యాయం చేయాలి: పురందేశ్వరి

-

ఏపీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పి.. లెక్కకు మించి అప్పులు చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. గవర్నర్ నజీరన్ను బీజేపీ నేతలతో కలిసిన ఆమె.. పంచాయతీ నిధుల మళ్లింపు, అప్పులపై ఫిర్యాదు చేశారు. ‘ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. రూ.7600 కోట్ల నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సర్పంచ్ కు న్యాయం చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. “గ్రామాలను అభివృద్ధి చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేశారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో ప్రభుత్వం పనులు నిలిపివేశారు.

చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి పరిస్థితి వివరించాం. సర్పంచులకు న్యాయం చేయాలని, గ్రామీణ వ్యవస్థను కాపాడాలని కోరాం. రాష్ట్రంపై ఉన్న అప్పుల భారంపై పదేపదే బీజేపీ ప్రస్తావిస్తూ ఉంది. గడిచిన 4 సంవత్సరాల కాలంలో 7.44 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఎఫ్ఆర్బీఎంకు లోబడి తీసుకొచ్చిన అప్పు కొంతవరకు ఉంటే ఆ పరిధిలోకి రానివ్వకుండా అనేక విధాలుగా వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు తెచ్చింది.” అని దగ్గుబాటి పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version