కేసీఆర్ కట్టిన ఆ డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా కేంద్రం డబ్బులతోనే : పురందేశ్వరి

-

మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి కోరారు. ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మాట తప్పారు.. ఒక్కసారి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి, అదే కార్యాలయం ద్వారా పేపర్ లీక్ అవ్వటంతో అభ్యర్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.. అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం ఉంది అని ఆమె ప్రశ్నించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని గొప్ప వాగ్దానాలు చేశారు.. కానీ ఆ హామీ నెరవేర్చలేదని.. జీహెచ్ఎంసీలో 9 లక్షల అప్లికేషన్స్ ఉండగా కేవలం 50 వేల ఇండ్లు మాత్రమే నిర్మించారు అని పురందేశ్వరి ఆరోపించారు. . డబుల్ బెడ్రూం ఇళ్లలో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయన్నారు.

దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట తప్పారని ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దళితబందు పథకంలో భారీ అవినీతి జరుగుతోందన్నారు. దీనిని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారన్నారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలలో ఉపాధ్యాయులకు వేలపోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయటం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చామని చెప్పి కేసీఆర్ ఓట్లు అడగగలరా? అని ప్రశ్నించారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ బీజేపీతోనే సాధ్యమన్నారు. పురందేశ్వరి చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తరఫున కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version