ఈసారి గెలిస్తే కోడళ్ల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం : కేటీఆర్‌

-

తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వే నేనంటూ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్ షోలో ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరైనారు.

కరెంట్‌ గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు, శరం, ఇజ్జత్ ఉండాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆ పార్టీ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్ షో లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో బీదాబిక్కి రైతులు ఉన్నారు. మూడు గంటలు కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి అంటున్నడు. రైతుబంధు వద్దు, పట్వారీ వ్యవస్థ కావాలని అంటున్నారు. ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. 55 ఏండ్లు, 11 సార్లు అవకాశాలు ఇస్తే ఏం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సిరిసిల్లలో అభివృద్ధి జరగలేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఈసారి గెలిస్తే కోడళ్ల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం ప్రవేశ పెడతామన్నారు. వచ్చే జనవరిలో కొత్త పెన్షన్‌లు, కొత్త కార్డులు, బీడీ కార్మికులకు పెన్షన్‌లు ఇస్తామని హామీనిచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version