‘ఆటోజానీ’గా చిరంజీవి.. అభిమానుల్లో సరికొత్త ఆశలు రేపుతున్న పూరీ జగన్నాథ్!?

-

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..ప్రజెంట్ ‘లైగర్’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఆయన తీసిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా, ఆయన తన తదుపరి చిత్రం ‘జనగణమన(జేజీఎం)’ కూడా విజయ్ తోనే తీయబోతున్నారు. ఈ క్రమంలోనే నటుడిగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ లో నటిస్తున్నారు.

‘గాడ్ ఫాదర్’ లో కీలక పాత్ర కోసం పూరీ జగన్నాథ్ ను మేకర్స్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవితో మళ్లీ ‘ఆటోజానీ’ ఫిల్మ్ కోసం పూరీ జగన్నాథ్ చర్చలు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అవి చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరు రీఎంట్రీ ఫిల్మ్ కు నిజానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాల్సిందని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

అప్పట్లో ‘ఆటోజానీ’ పిక్చర్ స్టోరిని పూరీ జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవికి వినిపించగా, ఫస్ట్ హాఫ్ నచ్చిందన్నారని , కానీ, సెకండాఫ్ లో మార్పులు కావాలని అడిగారని పూరీ చెప్పారు. ఈ నేపథ్యంలో ‘జన గణ మన’ షూట్ కంప్లీట్ అయిన తర్వాత చిరంజీవితో ‘ఆటోజానీ’ చేయాలని పూరీ జగన్నాథ్ డిసైడ్ అవుతారని మెగా అభిమానులు ఆశపడుతున్నారు. ‘లైగర్’ ఫిల్మ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలవాలని పూరీ జగన్నాథ్ అనుకుంటున్నారట. అలా తమ మధ్య మళ్లీ ‘గాడ్ ఫాదర్’ ఫిల్మ్ షూటింగ్ లో క్లోజ్ నెస్ బాగా పెరిగిందని టాక్.

పూరీ జగన్నాథ్ ..పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో సినిమాలు చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా పూరీ జగన్నాథ్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. చూడాలి మరి. . అది ఎప్పుడు జరుగుతుందో..

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version