53 ఏళ్ల తర్వాత దొరికిన పర్సు.. అదృష్టమే..!

-

కొందరికి అదృష్టం ఎలా ఉంటుందంటే ఎన్నో ఏళ్ల కిందట పోగొట్టుకున్న వస్తువులు దొరికేస్తుంటాయి. ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరు తమ విలువైన వస్తువులను పొగొట్టుకుంటుంటారు. ఆ వస్తువుల కోసం వెతకని ప్రదేశాలు ఉండవు.. ఎక్కని పోలీస్ మెట్టు ఉండదు. ఎంతో ప్రయత్నించిన తర్వాత ఇక ఆ వస్తువు దొరకదని బాధ పడి మర్చిపోతుంటారు. అయితే అనుకోకుండా ఎన్నో ఏళ్ల తర్వాత ఆ వస్తువు తిరిగి దొరికితే ఎలా ఉంటుంది. ఇక ఆ ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఓ వ్యక్తికి 53 ఏళ్ల కిందట పోగొట్టుకున్న విలువైన వస్తువులు తిరిగి దక్కాయి. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియోగోకు చెందిన పౌల్ గ్రిశామ్ (91 ఏళ్లు) నౌకా వాతావరణ శాస్త్రవేత్తగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. పౌల్ గ్రిశామ్ అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో ఏడాది పాటు శాస్త్రవేత్తగా పని చేశాడు. 13 నెలల తర్వాత తిరిగి కాలిఫోర్నియాకు వెళ్తుండగా.. అతడి పర్సు పోగొట్టుకుపోయింది. దానిలో ఎంతో విలువైన గ్రిశామ్ నేవీ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ‘ది ఐస్’ ప్రశంసా పత్రం, అణు, జీవ రసాయన దాడులు జరిగినప్పుడు చర్యలు తీసుకోవడానికి రిఫరెన్స్ కార్డు, బీర్ రేషన్ కార్డు, టాక్స్ స్టేట్మెంట్ వంటి విలువైన పత్రాలు, కార్డులు ఆ పర్సులో ఉన్నాయి.

2014 సంవత్సరంలో అంటార్కిటికాలోని రాస్ ఐర్లాండ్‌లోని మెక్ ముర్డో స్టేషన్‌లోని పాత భవనాన్ని కూల్చారు. గ్రిశామ్ పోగొట్టుకున్న పర్సు, మరో వ్యక్తికి చెందిన ఓ బిల్ ఫోర్డ్ అప్పుడు దొరికాయి. ఇండియానాలోని స్పిరిట్ ఆఫ్ 45 అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన బ్రూస్ మెక్ సహకారంతో స్టీఫెన్ డెకాటో, ఆయన కూతురు సారా లిండ్ బర్గ్ ఎంతో శ్రమించి గ్రీశామ్ చిరునామా సంపాదించి పర్సును అందజేశారు. 53 ఏళ్ల తర్వాత పర్సును చూడటంతో గ్రిశామ్ సంతోషం వ్యక్తం చేశాడు. తన అనుభవాలను పంచుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version